1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు.
1בְּ/רֵאשִׁ֖ית בָּרָ֣א אֱלֹהִ֑ים אֵ֥ת הַ/שָּׁמַ֖יִם וְ/אֵ֥ת הָ/אָֽרֶץ
2భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.
2וְ/הָ/אָ֗רֶץ הָיְתָ֥ה תֹ֨הוּ֙ וָ/בֹ֔הוּ וְ/חֹ֖שֶׁךְ עַל פְּנֵ֣י תְה֑וֹם וְ/ר֣וּחַ אֱלֹהִ֔ים מְרַחֶ֖פֶת עַל פְּנֵ֥י הַ/מָּֽיִם
3దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది.
3וַ/יֹּ֥אמֶר אֱלֹהִ֖ים יְהִ֣י א֑וֹר וַֽ/יְהִי אֽוֹר
4ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు.
4וַ/יַּ֧רְא אֱלֹהִ֛ים אֶת הָ/א֖וֹר כִּי ט֑וֹב וַ/יַּבְדֵּ֣ל אֱלֹהִ֔ים בֵּ֥ין הָ/א֖וֹר וּ/בֵ֥ין הַ/חֹֽשֶׁךְ
5దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు.
5וַ/יִּקְרָ֨א אֱלֹהִ֤ים לָ/אוֹר֙ י֔וֹם וְ/לַ/חֹ֖שֶׁךְ קָ֣רָא לָ֑יְלָה וַֽ/יְהִי עֶ֥רֶב וַֽ/יְהִי בֹ֖קֶר י֥וֹם אֶחָֽד
6దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు.
6וַ/יֹּ֣אמֶר אֱלֹהִ֔ים יְהִ֥י רָקִ֖יעַ בְּ/ת֣וֹךְ הַ/מָּ֑יִם וִ/יהִ֣י מַבְדִּ֔יל בֵּ֥ין מַ֖יִם לָ/מָֽיִם
7దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది.
7וַ/יַּ֣עַשׂ אֱלֹהִים֮ אֶת הָ/רָקִיעַ֒ וַ/יַּבְדֵּ֗ל בֵּ֤ין הַ/מַּ֨יִם֙ אֲשֶׁר֙ מִ/תַּ֣חַת לָ/רָקִ֔יעַ וּ/בֵ֣ין הַ/מַּ֔יִם אֲשֶׁ֖ר מֵ/עַ֣ל לָ/רָקִ֑יעַ וַֽ/יְהִי כֵֽן
8దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు.
8וַ/יִּקְרָ֧א אֱלֹהִ֛ים לָֽ/רָקִ֖יעַ שָׁמָ֑יִם וַֽ/יְהִי עֶ֥רֶב וַֽ/יְהִי בֹ֖קֶר י֥וֹם שֵׁנִֽי
9దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది.
9וַ/יֹּ֣אמֶר אֱלֹהִ֗ים יִקָּו֨וּ הַ/מַּ֜יִם מִ/תַּ֤חַת הַ/שָּׁמַ֨יִם֙ אֶל מָק֣וֹם אֶחָ֔ד וְ/תֵרָאֶ֖ה הַ/יַּבָּשָׁ֑ה וַֽ/יְהִי כֵֽן
10దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.
10וַ/יִּקְרָ֨א אֱלֹהִ֤ים לַ/יַּבָּשָׁה֙ אֶ֔רֶץ וּ/לְ/מִקְוֵ֥ה הַ/מַּ֖יִם קָרָ֣א יַמִּ֑ים וַ/יַּ֥רְא אֱלֹהִ֖ים כִּי טֽוֹב
11దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
11וַ/יֹּ֣אמֶר אֱלֹהִ֗ים תַּֽדְשֵׁ֤א הָ/אָ֨רֶץ֙ דֶּ֔שֶׁא עֵ֚שֶׂב מַזְרִ֣יעַ זֶ֔רַע עֵ֣ץ פְּרִ֞י עֹ֤שֶׂה פְּרִי֙ לְ/מִינ֔/וֹ אֲשֶׁ֥ר זַרְע/וֹ ב֖/וֹ עַל הָ/אָ֑רֶץ וַֽ/יְהִי כֵֽן
12వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
12וַ/תּוֹצֵ֨א הָ/אָ֜רֶץ דֶּ֠שֶׁא עֵ֣שֶׂב מַזְרִ֤יעַ זֶ֨רַע֙ לְ/מִינֵ֔/הוּ וְ/עֵ֧ץ עֹֽשֶׂה פְּרִ֛י אֲשֶׁ֥ר זַרְע/וֹ ב֖/וֹ לְ/מִינֵ֑/הוּ וַ/יַּ֥רְא אֱלֹהִ֖ים כִּי טֽוֹב
13రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు.
13וַֽ/יְהִי עֶ֥רֶב וַֽ/יְהִי בֹ֖קֶר י֥וֹם שְׁלִישִֽׁי
14దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి.
14וַ/יֹּ֣אמֶר אֱלֹהִ֗ים יְהִ֤י מְאֹרֹת֙ בִּ/רְקִ֣יעַ הַ/שָּׁמַ֔יִם לְ/הַבְדִּ֕יל בֵּ֥ין הַ/יּ֖וֹם וּ/בֵ֣ין הַ/לָּ֑יְלָה וְ/הָי֤וּ לְ/אֹתֹת֙ וּ/לְ/מ֣וֹעֲדִ֔ים וּ/לְ/יָמִ֖ים וְ/שָׁנִֽים
15భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది.
15וְ/הָי֤וּ לִ/מְאוֹרֹת֙ בִּ/רְקִ֣יעַ הַ/שָּׁמַ֔יִם לְ/הָאִ֖יר עַל הָ/אָ֑רֶץ וַֽ/יְהִי כֵֽן
16దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
16וַ/יַּ֣עַשׂ אֱלֹהִ֔ים אֶת שְׁנֵ֥י הַ/מְּאֹרֹ֖ת הַ/גְּדֹלִ֑ים אֶת הַ/מָּא֤וֹר הַ/גָּדֹל֙ לְ/מֶמְשֶׁ֣לֶת הַ/יּ֔וֹם וְ/אֶת הַ/מָּא֤וֹר הַ/קָּטֹן֙ לְ/מֶמְשֶׁ֣לֶת הַ/לַּ֔יְלָה וְ/אֵ֖ת הַ/כּוֹכָבִֽים
17భూమికి వెలుగు ఇవ్వడానికీ,
17וַ/יִּתֵּ֥ן אֹתָ֛/ם אֱלֹהִ֖ים בִּ/רְקִ֣יעַ הַ/שָּׁמָ֑יִם לְ/הָאִ֖יר עַל הָ/אָֽרֶץ
18పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
18וְ/לִ/מְשֹׁל֙ בַּ/יּ֣וֹם וּ/בַ/לַּ֔יְלָה וּֽ/לֲ/הַבְדִּ֔יל בֵּ֥ין הָ/א֖וֹר וּ/בֵ֣ין הַ/חֹ֑שֶׁךְ וַ/יַּ֥רְא אֱלֹהִ֖ים כִּי טֽוֹב
19రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు.
19וַֽ/יְהִי עֶ֥רֶב וַֽ/יְהִי בֹ֖קֶר י֥וֹם רְבִיעִֽי
20దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు.
20וַ/יֹּ֣אמֶר אֱלֹהִ֔ים יִשְׁרְצ֣וּ הַ/מַּ֔יִם שֶׁ֖רֶץ נֶ֣פֶשׁ חַיָּ֑ה וְ/עוֹף֙ יְעוֹפֵ֣ף עַל הָ/אָ֔רֶץ עַל פְּנֵ֖י רְקִ֥יעַ הַ/שָּׁמָֽיִם
21దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
21וַ/יִּבְרָ֣א אֱלֹהִ֔ים אֶת הַ/תַּנִּינִ֖ם הַ/גְּדֹלִ֑ים וְ/אֵ֣ת כָּל נֶ֣פֶשׁ הַֽ/חַיָּ֣ה הָֽ/רֹמֶ֡שֶׂת אֲשֶׁר֩ שָׁרְצ֨וּ הַ/מַּ֜יִם לְ/מִֽינֵ/הֶ֗ם וְ/אֵ֨ת כָּל ע֤וֹף כָּנָף֙ לְ/מִינֵ֔/הוּ וַ/יַּ֥רְא אֱלֹהִ֖ים כִּי טֽוֹב
22దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు.
22וַ/יְבָ֧רֶךְ אֹתָ֛/ם אֱלֹהִ֖ים לֵ/אמֹ֑ר פְּר֣וּ וּ/רְב֗וּ וּ/מִלְא֤וּ אֶת הַ/מַּ֨יִם֙ בַּ/יַּמִּ֔ים וְ/הָ/ע֖וֹף יִ֥רֶב בָּ/אָֽרֶץ
23రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.
23וַֽ/יְהִי עֶ֥רֶב וַֽ/יְהִי בֹ֖קֶר י֥וֹם חֲמִישִֽׁי
24దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది.
24וַ/יֹּ֣אמֶר אֱלֹהִ֗ים תּוֹצֵ֨א הָ/אָ֜רֶץ נֶ֤פֶשׁ חַיָּה֙ לְ/מִינָ֔/הּ בְּהֵמָ֥ה וָ/רֶ֛מֶשׂ וְ/חַֽיְתוֹ אֶ֖רֶץ לְ/מִינָ֑/הּ וַֽ/יְהִי כֵֽן
25దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
25וַ/יַּ֣עַשׂ אֱלֹהִים֩ אֶת חַיַּ֨ת הָ/אָ֜רֶץ לְ/מִינָ֗/הּ וְ/אֶת הַ/בְּהֵמָה֙ לְ/מִינָ֔/הּ וְ/אֵ֛ת כָּל רֶ֥מֶשׂ הָֽ/אֲדָמָ֖ה לְ/מִינֵ֑/הוּ וַ/יַּ֥רְא אֱלֹהִ֖ים כִּי טֽוֹב
26దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు.
26וַ/יֹּ֣אמֶר אֱלֹהִ֔ים נַֽעֲשֶׂ֥ה אָדָ֛ם בְּ/צַלְמֵ֖/נוּ כִּ/דְמוּתֵ֑/נוּ וְ/יִרְדּוּ֩ בִ/דְגַ֨ת הַ/יָּ֜ם וּ/בְ/ע֣וֹף הַ/שָּׁמַ֗יִם וּ/בַ/בְּהֵמָה֙ וּ/בְ/כָל הָ/אָ֔רֶץ וּ/בְ/כָל הָ/רֶ֖מֶשׂ הָֽ/רֹמֵ֥שׂ עַל הָ/אָֽרֶץ
27దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.
27וַ/יִּבְרָ֨א אֱלֹהִ֤ים אֶת הָֽ/אָדָם֙ בְּ/צַלְמ֔/וֹ בְּ/צֶ֥לֶם אֱלֹהִ֖ים בָּרָ֣א אֹת֑/וֹ זָכָ֥ר וּ/נְקֵבָ֖ה בָּרָ֥א אֹתָֽ/ם
28దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు.
28וַ/יְבָ֣רֶךְ אֹתָ/ם֮ אֱלֹהִים֒ וַ/יֹּ֨אמֶר לָ/הֶ֜ם אֱלֹהִ֗ים פְּר֥וּ וּ/רְב֛וּ וּ/מִלְא֥וּ אֶת הָ/אָ֖רֶץ וְ/כִבְשֻׁ֑/הָ וּ/רְד֞וּ בִּ/דְגַ֤ת הַ/יָּם֙ וּ/בְ/ע֣וֹף הַ/שָּׁמַ֔יִם וּ/בְ/כָל חַיָּ֖ה הָֽ/רֹמֶ֥שֶׂת עַל הָ/אָֽרֶץ
29దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
29וַ/יֹּ֣אמֶר אֱלֹהִ֗ים הִנֵּה֩ נָתַ֨תִּי לָ/כֶ֜ם אֶת כָּל עֵ֣שֶׂב זֹרֵ֣עַ זֶ֗רַע אֲשֶׁר֙ עַל פְּנֵ֣י כָל הָ/אָ֔רֶץ וְ/אֶת כָּל הָ/עֵ֛ץ אֲשֶׁר בּ֥/וֹ פְרִי עֵ֖ץ זֹרֵ֣עַ זָ֑רַע לָ/כֶ֥ם יִֽהְיֶ֖ה לְ/אָכְלָֽה
30భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది.
30וּֽ/לְ/כָל חַיַּ֣ת הָ֠/אָרֶץ וּ/לְ/כָל ע֨וֹף הַ/שָּׁמַ֜יִם וּ/לְ/כֹ֣ל רוֹמֵ֣שׂ עַל הָ/אָ֗רֶץ אֲשֶׁר בּ/וֹ֙ נֶ֣פֶשׁ חַיָּ֔ה אֶת כָּל יֶ֥רֶק עֵ֖שֶׂב לְ/אָכְלָ֑ה וַֽ/יְהִי כֵֽן
31దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.
31וַ/יַּ֤רְא אֱלֹהִים֙ אֶת כָּל אֲשֶׁ֣ר עָשָׂ֔ה וְ/הִנֵּה ט֖וֹב מְאֹ֑ד וַֽ/יְהִי עֶ֥רֶב וַֽ/יְהִי בֹ֖קֶר י֥וֹם הַ/שִּׁשִּֽׁי
హీబ్రూ పాఠం, మూలపదాలు & రూపనిర్మాణం: Open Scriptures Hebrew Bible (OSHB), CC BY 4.0. Strong’s నిఘంటువు: James Strong (1894, public domain), డిజిటల్ ఎడిషన్ Open Scriptures (CC BY-SA). ఇంగ్లీష్: King James Version (public domain; UK: Crown letters patent). Verse text in your language: Indian Revised Version (IRV), © 2017, 2019 Bridge Connectivity Solutions, licensed CC BY-SA 4.0 (source: eBible.org). Shown where available; English (KJV) otherwise. Word meanings shown in your language are AI-assisted glosses of the English Strong’s lexicon — study aids, not an authoritative translation.